Elections | నియమాలు పాటించాలి

Elections | నియమాలు పాటించాలి
- మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్
Elections | దండేపల్లి, ఆంధ్రప్రభ : రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఇవాళ దండేపల్లి(Dandepally) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామగుండం కమిషనర్ అంబార్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఉగ్గే భాస్కర్ సర్పంచ్ అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఉగ్గే భాస్కర్(DCP Ugge Bhaskar) మాట్లాడుతూ… గ్రామపంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా జరుపుకోవాలని అభ్యర్థులకు, ప్రజలకు సూచించారు.
ప్రజలందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించి.. ప్రజల్లో నమ్మకం పెంపొందించాలని, శాంతి పరిస్థితులను పర్యవేక్షించడం, ఎన్నికల సమయంలో అసాంఘీక, అవాంఛనీయ చర్యలను అరికట్టాలన్నారు. ఎవరైనా పోలింగ్ కేంద్రాల(Polling centers) వద్ద గొడవలు సృష్టించడం, బెదిరింపులకు పాల్పడటం, అక్రమ ప్రవర్తనలు చేయడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు(Rallies) నిర్వహించరాదన్నారు.
ప్రజలు ఎన్నికల నియమాలను పాటించాలని, ప్రచారంలో భాగంగా ఎవరైనా డబ్బులు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే వెంటనే పోలీసులకు(to the police) సమాచారం ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో యువకులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, లక్షెటిపేట సిఐ రమణ మూర్తి, దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
