Elections | కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

Elections | కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

  • ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

Elections | నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సోమవారం తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డా.కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గ్రామ ప్రజలు బాణాసంచా, డప్పు చప్పుళ్ళతో పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకడం జరిగింది.

గ్రామాల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా… గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించుకోవాలని, అందులో భాగంగా నడిగడ్డ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వంజ విజయలక్ష్మి ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఎమ్మేల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply