Elections | ప్ర‌శాంతంగా పోలింగ్

Elections | ప్ర‌శాంతంగా పోలింగ్

  • ఓటేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు

Elections | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి గ్రామ పంచాయతీలో రెండో విడత ఎన్నికలు ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్నాయి. ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 25వ పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచే ఓటర్ల రద్దీ కనిపించింది. మహిళలు, యువతతో పాటు వృద్ధులు కూడా ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు కూడా ఆదివారం ఉదయం 8.25 గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకుని పదో వార్డు బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకూ 28 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నానికి ఇది 50 శాతాన్ని దాటింది.

Leave a Reply