Election withdrawal | బరిలో 51మంది సర్పంచ్ లు, 312 వార్డు సభ్యులు

Election withdrawal | రాయపోల్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మండల పరిధిలోని అన్ని గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయించడం జరిగిందని ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు(In-charge MPDO Srinivasa Rao) తెలిపారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల వివరాలు.. ఇలా ఉన్నాయి. మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఉంటే 75మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేశారని, 22 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ విత్ డ్రా(Nomination withdrawal) చేసుకున్నారన్నారు.
రెండు గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కటి మాత్రమే నామినేషన్లు వచ్చాయన్నారు.17 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని, 51మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండనున్నారన్నారు. 166 వార్డు సభ్యులకు గాను 372 నామినేషన్లు వేశారని, 28 మంది విత్ డ్రా చేసుకున్నారన్నారు. 32వార్డులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే వేశారన్నారు. 134 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని, 312 మంది వార్డు సభ్యులు బరిలో ఉండనున్నారన్నారు.
