SECURITY | ఎన్నికల నామినేషన్ కేంద్రం పరిశీలన…

SECURITY | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మండలంలోని ఏరాజ్ పల్లి గ్రామంలో ఎన్నికల నామినేషన్ (Election nomination) కేంద్రాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తును అయన పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట రూరల్ సీఐ విజయ్ బాబు ఉన్నారు.
