పేట చైర్ పర్సన్ దంపతులను సన్మానించిన సర్పంచ్…

పేట చైర్ పర్సన్ దంపతులను సన్మానించిన సర్పంచ్…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా శ్వేత సత్యయాదవ్ లను ఎన్నుకోవడంతో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రంసర్పంచ్ వాకిటి వెంకటేష్, మాజీ ఎంపిటిసి కిరణ్ కుమార్ బుధవారం చైర్పర్సన్ దంపతులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఎంపీడీకే అరుణ కేంద్ర ప్రభుత్వంనిధులతో నారాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందనిఅన్నారు.
నారాయణపేట ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో అభివృద్ధి చేసే పాలకులను ఓటు ద్వారా ఎన్నుకున్నారనిపేర్కొన్నారు. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రం మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
