election | చైర్మన్ గా అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి

election | చైర్మన్ గా అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి
election | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మొదటగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను నిర్వహించగా ఒకటవ వార్డు కౌన్సిలర్ కత్తి నరేందర్ మున్సిపల్ చైర్మన్ గా అప్పల కావ్య గణేష్ చక్రవర్తిని ప్రతిపాదించగా 22 వార్డు కౌన్సిలర్ ఇమ్రానుల్లా బలపరిచారు.
దీంతో ఎవరు పోటీలో లేకపోవడంతో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గా అప్పాల కావ్య కాంగ్రెస్ చక్రవర్తిని అధికారులు అధికారికంగా ప్రకటించారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిని 28వ కౌన్సిలర్ గోపు గోపి ప్రతిపాదించగా 27వ వార్డు కౌన్సిలర్ తౌహీదొద్దీన్ బలపరిచారు. పోటీలో ఎవరు లేకపోవడంతో వైస్ చైర్మన్ గా అప్పల గణేష్ చక్రవర్తిని వైస్ చైర్మన్ గా ప్రకటించారు.
అనంతరం మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి, వైస్ చైర్మన్ గా అప్పల గణేష్ చక్రవర్తిని అధికారికంగా ప్రకటిస్తూ వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
.. భైంసా మున్సిపల్ చైర్మన్ గా తూముల దత్తాత్రి ..
బైంసా మున్సిపల్ చైర్మన్ గా తుమోళ్ల దత్తాత్రిగా అలాగే వైస్ చైర్మన్ గా. బి బి కుతుజ సిద్ధికి ఇద్రీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భైంసా మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తుమ్మల దత్తాత్రి, వైస్ చైర్మన్ కుతుజా సిద్ధికిలను ఘనంగా సన్మానించారు.
ఖానాపూర్ లో కోరం లేక వాయిదా… ఇదిలా ఉంటే ఖానాపూర్ మున్సిపాలిటీలో కోరం లేక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
