ELC Campaign | గ్రామ అభివృద్థే నా లక్ష్యం

ELC Campaign | గ్రామ అభివృద్థే నా లక్ష్యం

ELC Campaign | గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : దొంగర్గం గ్రామంలో ఆదివారం సర్పంచ్ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాడవాడకు వెళ్లి గ్రామ ప్రజలను కలుసుకుని తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న అబ్దుల్ రెహమాన్, తాను గెలిస్తే మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి అంశాల పై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తనకు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply