Eklaspur | అభివృద్ధి చేసి చూపిస్తా..

Eklaspur | అభివృద్ధి చేసి చూపిస్తా..

Eklaspur, మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో చెన్నవేన లత సదానందం ఉన్నారు. గ్రామంలో ఏ నూట విన్న లతా సదానందం గెలుపు మాట వినిపిస్తుంది. ఒక్కసారి అవకాశం కల్పించండి.. ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆమె ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి.. ఊరి అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆమె తెలుపుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు అండతో ఏక్లాస్ పూర్ గ్రామాన్ని మంథని మండలంలోని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇస్తున్నారు. గ్రామంలోని నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందు ఉంటానని ఆమె తెలుపుతున్నారు.

గతంలో చెన్నవేన సదానందం సర్పంచ్ గా చేసిన సమయంలో గ్రామాన్ని అన్ని దిశల అభివృద్ధి చేసి చూపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మంజూరు చేయించారు. నిరుపేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. మరోసారి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని ఆయన సతీమణి లత తరపున సదానందం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గడపగడపకు ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమవుతు ముందుకెళ్తున్నారు. ప్రజలే లతమ్మ తరఫున ప్రచారం చేస్తూ విజయం ఖాయమని విశ్వసిస్తున్నారు. నిరుపేద ప్రజల సమస్యలు తీర్చడానికి ఎన్నికల్లోకి వచ్చానని, మరోసారి ఆశీర్వదించాలని చెన్నవేన లత సదానందం పేర్కొన్నారు. ఉంగరం గుర్తుకు ఓటేయాలని అన్నివేళలా ప్రజలకు అండగా ఉంటానని ఆమె అన్నారు. స్థానిక సమస్యల పైన అవగాహన ఉండడం కలిసొచ్చే అంశం. ఖచ్చితంగా ఆమె విజయం సాధించడం ఖాయమని ప్రజలంతా విశ్వసిస్తున్నారు.

Leave a Reply