ఈదురుగాలులకు నేలరాలిన మామిడికాయలు

ఈదురుగాలులకు నేలరాలిన మామిడికాయలు

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి. బుధవారం సాయంత్రం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొల్లూర్, సమస్తాపూర్, తదితర గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. తెలంగాణ కర్ణాటక సరిహద్దులోని ఇడ్లూరు శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి జాతర ముగింపు రోజు ఈదురుగాలులు వడగండ్ల వాన కురవడంతో జాతరకు భక్తులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.

మంగళ బుధవారాల్లో వాతావరణం చల్లగా ఉండడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. ఊట్కూర్ మండల కేంద్రం సమీపంలోని కన్ కల్ రోషనప్ప పొలంలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలకులడంతో నష్టం వాటిల్లిందని రైతు విలేకరులతో ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply