ఈదురు పద్మాకర్ నియామకం

కర్నూలు బ్యూరో, నవంబర్ 4, ఆంధ్రప్రభ : నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ (NHRC) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్‌గా ఈదురు పద్మాకర్ నియమితులయ్యారు. జాతీయ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి.

కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఈదురు పద్మాకర్ (Iduru Padmakar) మాట్లాడుతూ… “ఇది నాకు ఊహించని నియామకం. జాతీయ చైర్మన్ నాపై ఉంచిన నమ్మకానికి, బాధ్యతలకు న్యాయం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను” అని చెప్పారు. అలాగే పేదలు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మానవహక్కుల ఉల్లంఘనలకు గురయ్యే వర్గాలకు న్యాయం జరగాలనే దృఢనిశ్చయంతో పనిచేస్తానని పద్మాకర్ స్పష్టం చేశారు.

Leave a Reply