Educated | విద్యావంతుడి వైపే నాగేపల్లి ప్రజల చూపు

Educated | విద్యావంతుడి వైపే నాగేపల్లి ప్రజల చూపు

  • బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తా
  • స్థానిక సంస్థ ఎన్నికల్లో సమ్మన్న గెలుపు ఖాయం
  • నాగపెల్లి అభివృద్ధి చేయడమే నా కర్తవ్యం

Educated | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం నాగేపల్లి గ్రామంలో గుమ్మడి సమ్మయ్య గెలుపు దాదాపు ఖాయమైనట్లు గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. ప్రచారంలో ఆయన రాకెట్ లా దూసుకెళ్తున్నారు. బ్యాట్ గుర్తుకు ఓటెయ్యండి, బాధ్యతాయుతమైన పాలన అందిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. విద్యావంతుడైన(Educated) గుమ్మడి సమ్మయ్య వైపే గ్రామస్తులు మొగ్గు చూపడం విశేషం. ప్రజలంతా కలిసికట్టుగా ఆయన తరుపున ప్రచారం చేయడం మరో విశేషం.

స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గ్రామాన్ని కోతుల బాధ నుండి తప్పించేందుకు ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. గ్రామంలో యువత, మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తానని ఆయన తెలిపారు. అర్హులైన(qualified) ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.

గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ చేసేందుకు ప్రయత్నం చేస్తానని ఆయన వివరించారు. గ్రామంలో ప్రతి గడప గడపకు ఆయన ప్రచారం చేస్తూ ప్రజలతో(people) మమేకమవుతూ ముందుకు వెళ్తున్నారు. ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్ది ఉన్నత జీవితాలు ప్రసాదించిన గుమ్మడి సమ్మయ్యకే మా ఓటు అని ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించండి.. ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన ప్రచారానికి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు.

Leave a Reply