తజికిస్థాన్ : అఫ్ఘానిస్థాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఇవాళ మధ్యాహ్నం భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అఫ్ఘానిస్థాన్ – తజికిస్థాన్ సరిహద్దుల్లో భూమికి 130 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
అస్సాంలోనూ….
కాగా అస్సాంలోని నాగావ్‌లోనూ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9గా నమోదైంది. భూకంపం ప్రభావం నాగావ్, దాని పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించింది. అయితే దాని తీవ్రత తక్కువగా ఉండటం వల్ల, ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. భూకంపం సంభవించిన వెంటనే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
భూకంపం తర్వాత ఎలాంటి భయాందోళనలు, గందరగోళం తలెత్తలేదు. అస్సాం, ఈశాన్య భారతదేశం భూకంప జోన్‌లో ఉన్నాయి. అందువల్ల ఇక్కడ అప్పుడప్పుడు తేలికపాటి తీవ్రత భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. ఇటువంటి ప్రకంపనలు భౌగోళిక కార్యకలాపాల్లో భాగమని, వాటి తీవ్రత తక్కువగా ఉన్నంత వరకు ఆందోళన చెందడానికి ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు.