పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గంజాయ్, డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయమన్న ఈగల్ చీఫ్
విజయవాడ – ఏపీలో డ్రగ్స్ (Drugs ) నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ (Eagle Chief Ravi Krishna ) తెలిపారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో (Railway stations ) , రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు కొరమండల్ రైల్లో (Coramandal ) తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను, గంజాయినీ ఈగల్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.
ఈ సందర్భంగా రవి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయిస్తున్నామని అన్నారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసిన అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి వారి ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసిన ఎవ్వరిని వదిలి పెట్టమని హెచ్చరించారు. గంజాయి, నిషేధిత డ్రగ్స్ సప్లై చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసిన అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసిన ఎవ్వరిని వదిలి పెట్టబోమని రవి కృష్ణ హెచ్చరించారు.. గంజాయిని రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు. అర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే, ఈగల్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టిందని ఆకే రవి కృష్ణ వెల్లడించారు.