Dy,Speaker : ఉండి   అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

Dy,Speaker : ఉండి   అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

  • డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు

పాలకోడేరు,  ఆంధ్రప్రభ: ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఏపీ డిప్యూటీ స్పీకర్ (Dy.Speaker)  కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు.

గొరగనమూడి గ్రామం నుంచి గ్రామ శివారు వరకు 1.2 కి.మీ. మేర నాబార్డు నిధులు రూ.82 లక్షలతో సగం సీసీ రోడ్డు, మరో సగం తారురోడ్డును నిర్మించేందుకు శనివారం రఘురామకృష్ణం రాజు భూ మిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను తీర్చడంలో ముందు వరుసలో ఉందన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే తమ ధ్యేయమన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొట్టుముక్కల శివాజీరాజు, ఎంపీటీసీ పార్వతీ కృష్ణకుమారి, పాలకోడేరు సహకార సంఘ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, తాహసిల్దార్ భారతి విజయలక్ష్మి ,ఎంపీడీవో వి. రెడ్డియ్య, నీటి సంఘం నాయకులు సూర్యనారాయణ రాజు, కూటమి నాయకులు గంగాధర్, శ్రీనివాస్, ఇంజేటి వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply