కేసీఆర్, కేటీఆర్‌లను కలిసిన దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య- జయతార దంపతులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

తన కుమార్తె వివాహం ఏప్రిల్ 12వ తేదీన నిశ్చయమైనట్లు తెలియజేస్తూ, పెళ్లి పత్రికను అందజేసి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని ఆయన కోరగా, కేసీఆర్ దంపతులు, కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
