NZB | విధులకు ఆలస్యం… ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
నిజామాబాద్, విద్యా, వైద్య విభాగం, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ) : ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విధులు నిర్వర్తించాలని, లేకుంటే చర్యలు తప్పవని డీఈవో అశోక్ హెచ్చరించారు. గురువారం నగరంలోని వినాయక్ నగర్ లోని ప్రాథమిక ఉన్నత ప్రభుత్వ పాఠశాలను (జి యూపిఎస్) జిల్లా విద్యా శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు రాలేదు. దీంతో సమయ పాలన పాటించని నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ… విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతో పాటు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.