కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా…

కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా…

మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ కేమ్మిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ లో రాష్ట్ర కమిటీ జాయింట్ సెక్రటరీ గా నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన కొండా విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ కేమ్మిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ప్రస్తుతం నారాయణ పేట జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఉన్న కొండా విజయ్ కుమార్ మెజారిటీ సభ్యుల మద్దతుతో రాష్ట్ర తెలంగాణ కేమ్మిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ లో జాయింట్ సెక్రటరీ గా ఎంపికయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తొడపునూరి రాజు కొండా విజయ్ కుమార్ సేవలను గుర్తించి రాష్ట్ర కమిటీ లో కీలక భాద్యత జాయింట్ సెక్రటరీ గా నియమిస్తూ శాలువాతో ఘనంగా నిర్వహించి మెమొంటో అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా తనకు అవకాశం కల్పించిన సహచర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నారాయణ పేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా అంతకు ముందు మక్తల్ పట్టణ అధ్యక్షుడిగా తన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం లభించింది అని అభిప్రాయపడ్డారు .

రాష్ట్ర కమిటీ లో తన బాధ్యతలకు పూర్తిగా న్యాయం చేస్తానని అన్నారు .కెమిస్ట్ డ్రగ్గోస్ట్ ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు . తన ఎంపికకు సహకరించిన వారందరికీ కొండా విజయకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కొండా విజయ్ కుమార్ ఎంపిక కూడా పట్ల మక్తల్ కమిటీ సభ్యులు ఖాజా మైనొద్దీన్, తాళంపల్లి అశోక్, సుధాకర్, ఉమాకాంత్, మధు, వట్టం నాగేందర్, అశోక్, ప్రభాకర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply