HYD | హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీ… ఐదుగురి అరెస్ట్ !

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీపై పోలీసులు దాడులు నిర్వహించారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ జీఆర్‌సీ రెసిడెన్సీలో గురువారం డ్రగ్స్‌ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించిన పోలీసులు గంజాయి సేవిస్తున్న ఐదుగురికి డ్రగ్‌ పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షలలో డ్రగ్స్‌ సేవించినట్లు తేలడంతో వెంకటేష్‌, విజయ రెడ్డి,రాహుల్‌, శివకుమార్‌ ప్రియాంక రెడ్డిలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా డ్రగ్స్‌ పార్టీ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందటంతో సైబరాబాద్‌ ఎస్వోటీ, నార్సింగి పోలీసులు సంయుక్త దాడులు జరిపారు.

తన స్నేహితులతో కలిసి డ్రగ్స్‌ పార్టీ చేసుకుంటు-న్న ప్రియాంకరెడ్డి గతంలో మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరితో పాటు హష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితుల నుంచి రూ.15 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *