భువనగిరిలో డ్రగ్స్ రహిత ర్యాలీ

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భువనగిరిలో శనివారం నిర్వహించిన ‘డ్రగ్స్ రహిత తెలంగాణ’ ర్యాలీలో ఆలేరు ప్రాంతానికి చెందిన మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో డ్రగ్స్ కంట్రోల్ డీఎస్పీ సైదులు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తదితరులతో కలిసి వారు పాల్గొని డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
