Drug Case | కీలక నిందితుడు అరెస్ట్

Drug Case | కీలక నిందితుడు అరెస్ట్

Drug Case | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. కీలక నిందితుడి అరెస్టుతో కేసు కొత్త మలుపు తిరిగింది. సిట్ దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో డ్రగ్ పెడ్లర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరైన కౌశిక్ రవి ఇచ్చిన సమాచారంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన సిట్ బృందం హైదరాబాద్‌లోనే అతన్ని పట్టుకుంది.

దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెల్లడైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద అభిషేక్ సింగ్ నుంచి రోహిత్ డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం జరిగిన పార్టీలో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, పుట్టా మహేశ్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి డ్రగ్స్ వినియోగించినట్లు విచారణలో తేలింది. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడగా, పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, అర్జున్ రెడ్డి మద్యంలో కొకైన్ కలిపి సేవించినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇప్పటికే కీలక నిందితుడు అభిషేక్ సింగ్ అరెస్టుతో కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply