మంత్రాలయం, (ఆంధ్రప్రభ ): మంత్రాలయం సమీపంలో ప్రవహించే తుంగభద్ర నదిలో కర్ణాటకకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాకు చెందిన ప్రమోద్, సచిన్, అజిత్ అనే ముగ్గురు వ్యక్తులు నదిలో స్నానం చేయడానికి వెళ్లగా… వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. తప్పిపోయిన వారి కోసం మంత్రాలయంలో ఎస్ఐ శివాంజల్, సర్పంచ్ తెలబండ్ల భీమయ్య ఈతగాళ్లతో నదిని గాలిస్తున్నారు.
