Drone attack | డ్రోన్ దాడి.. 24 మంది మృతి

Drone attack | డ్రోన్ దాడి.. 24 మంది మృతి
Drone attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రష్యా (Russia) ఆక్రమిత ఖేర్సన్ ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు (Drone attack) చేపట్టినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. నల్ల సముద్రం తీరంలోని ఓ కేఫ్, హోటల్‌పై మూడు డ్రోన్లతో దాడి జరిగినట్లు రష్యా నియమిత ఖేర్సన్ గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో (Vladimir Saldo) తెలిపారు.
ఈదాడిలో 24మంది పౌరులు మరణించగా, సుమారు 50మంది గాయపడ్డారని ఆయన వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల్లో (New Year celebrations) పాల్గొంటున్న పౌరులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సాల్డో ఆరోపించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై ఉక్రెయిన్ (Ukraine) నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడి మరిన్ని ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. రష్యా నియమిత అధికారులు దాడిని తీవ్రంగా ఖండించారు.
