Driving | మెరుగైన సేవలు అందించాలి…

Driving | మెరుగైన సేవలు అందించాలి…

Driving | బిక్కనూర్, ఆంధ్రప్రభ : రవాణా శాఖ ద్వారా వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని బిక్కనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బాపురెడ్డి(Director Bapureddy) కోరారు. ఇటీవల కామారెడ్డి జిల్లా ఇన్చార్జి రవాణా శాఖ అధికారిగా పదవి బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

తన కార్యాలయంలో ఆయనను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం బాపురెడ్డి మాట్లాడుతూ.. పనుల కోసం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా సకాలంలో పనులు చేపించాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఇన్చార్జి రవాణా శాఖ అధికారి శ్రీనివాస్(Srinivas) మాట్లాడుతూ.. వాహనదారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిబంధన మేరకు ప్రతి ఒకరికి డ్రైవింగ్ లైసెన్స్(Driving License) జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply