మాజీ ఎమ్మెల్యే సక్కు కృషితో తాగునీటి పరిష్కారo

జైనూర్, ఆంధ్రప్రభ : జైనూర్ మండలంలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు నిరంతరం కృషి చేస్తున్నారని జెండగూడ సర్పంచ్ ఉయిక చందన్ షా, కాంగ్రెస్ నాయకులు జన్నావార్ పవన్ కుమార్ తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రభుత్వ పరంగా మూడు నూతన బోర్లను మంజూరు చేయించగా, ఆదివారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జెండగూడ, అల్లిగూడ, లెండిగుడ గ్రామాల్లో వాటిని త్రవ్వించారు.

తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నారని నాయకులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply