ప్రేమ జంట వీరంగం

  • సత్యసాయి జిల్లాలో హల్చల్


( శ్రీ సత్యసాయి బ్యూరో , ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai district) కదిరి పట్టణంలోని తాయి గ్రాండ్ హోటల్ సమీపంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ ప్రేమజంట తప్ప తాగి హల్ చల్ చేసింది. స్థానికులతో వీరంగం ఆడింది. గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసుల్ని లెక్కచేయలేదు. అసలు తగ్గలేదు. దురుసు గా ప్రవర్తించారు. అన్నమయ్య జిల్లా చక్రాయపేటకు చెందిన లోకేష్, బి కొత్త కోటకు చెందిన షేక్ బానుగా వీరిని గుర్తించారు. చివరికి వారిని పట్టుకొని, హాస్పిటల్ కు తరలించగా.. పూటుగా మద్యం తాగినట్లు వైద్యల నిర్ధారించారు. కదిరి పట్టణ సి ఐ.డివి నారాయణరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply