Mayor | డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి

Mayor | డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి
వరంగల్ పురపాలక మేయర్ దృష్టి పెట్టాలి
Mayor | హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : వరంగల్ జిడబ్ల్యూఎంసి పరిధిలోని ఉర్సు ఉప్పరకుంట సమీపంలోని సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు నిరసన చేపట్టారు. రాజకీయాలకు అతీతంగా అన్ని సంఘాల నేతలు ర్యాలీ (Leaders rally) నిర్వహించారు. జీడబ్ల్యూఎంసి నగర మేయర్ గుండు సుధారాణి పెట్టాలని కోరుతున్నారు. స్మశాన వాటిక ఉపయోగకరంగా ఉండేలా చూడాలన్నారు.
30 సంవత్సరాలుగా ఆ సమీపంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. వర్షాలు పడి డ్రైనేజీ సమస్య ఏర్పడుతుందన్నారు. తక్షణమే డ్రైనేజీ పనుల నిర్వహణ కొనసాగించి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా 3 రోజుల్లో సమస్యను (the problem) పరిష్కరిస్తామంటూ ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. 3 రోజులు కాదు, 15 రోజుల సమయంలో పనులు పరిష్కరించకపోతే కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

