Don’t worry | కార్డు పోయిందా.. కంగారు వద్దు !!

Don’t be worry | కార్డు పోయిందా.. కంగారు వద్దు !!

  • ఏ కార్డు పోయినా.. పరేషాన్‌ వద్దే వద్దు
  • సంబంధిత అధికారులను సంప్రదిస్తే సరి..

ఝరాసంఘం, (ఆంధ్రప్రభ): ఆధార్‌, రేషన్‌, ఓటర్‌, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోయిందా, కంగారు పడొద్దు. ఆయా కార్డులు కోల్పోయిన వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారికి సరైన సమాచారం ఇచ్చేవారు లేక ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమవుతుంటారు. ఏదైనా కార్డు అవసరం పడినప్పుడు, ఏదైనా కార్డు అవసరం పడినప్పుడు హైరానా పడుతుంటారు.

అలాంటి వారి కోసం ఈ సమాచారం. ఏటీఎం కార్డులు మొదలుకొని పాన్‌ కార్డుల వరకు రోజువారి జీవితంలో భాగమ య్యాయి. అందుకే వీటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. ఒకసారి పర్సు పోయినప్పుడు, జిరాక్స్‌ తీసుకునే సందర్భంలోనూ, ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయినప్పుడు కాళ్లు చేతులు ఆడవు.

వాటిని ఎలా పొందాలో తెలియ తల్లడిల్లుతాం. కానీ కార్డులు పోయినప్పుడు ఇలా ఇలాంటి ఆందోళన అవసరం లేదు. కొంత సమయం తీసుకున్న వాటిని తక్కువ ఖర్చుతోనే పొందవచ్చు. అది ఎలాగో ఒక్కసారి లుక్కేద్దాం.

పాస్‌ పోర్టు కోసం కేసు నమోదు చేయాలి..

పాస్‌ పోర్టు పో గొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ జరిపి లభించ కపోతే ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌ పోర్టు అధికారి హైదరాబాద్‌ పేరిట రూ.వెయ్యి డిడి తీయాలి.

ఈ రెండి టిని జతపరిచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి డూప్లికేట్‌ పాస్‌ పోర్టు జారీ చేస్తారు. ఇందుకు మూడు నెలల సమయం పట్టవచ్చు. తాత్కాల్‌ పాస్‌ పోర్టు అయితే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి.

Leave a Reply