గ్యాస్ కోసం ఆందోళన చెందవద్దు..

బిక్కనూరు, ఆంధ్రప్రభ : వంట గ్యాస్ కోసం వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని బిక్కనూర్ మండలానికి చెందిన హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు శరత్ రెడ్డి, రమేష్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వారు మాట్లాడుతూ వినియోగదారుల కావలసిన వంట గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపారు

ఆన్లైన్ లో గ్యాస్ కోసం వినియోగదారులు బుక్ చేసుకోవాలని వారు సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని వారు తెలిపారు. కేవలం కమర్షియల్ గ్యాస్ మాత్రమే కొరత ఉందని చెప్పారు.

గ్యాస్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపి వేసిందని ఈ సందర్భంగా వారు సూచించారు. గ్యాస్ అవసరం ఉన్నవారు మండల కేంద్రంలో గల ఏజెన్సీ కార్యాలయానికి రావాలని వారు తెలిపారు. వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి వంట గ్యాస్ వినియోగదారులు బ్లాక్ మార్కెట్లో ఎలాంటి కొనుగోలు చేయవద్దని వారు చెప్పారు.

Leave a Reply