మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : మిర్యాలగూడ శాసనసభ్యులు (Miryalaguda MLA) బత్తుల లక్ష్మారెడ్డి మరోసారి తనలోని సేవా గుణాన్ని చాటుకున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని సుమారు లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా చొప్పున అందించాలని కోరుతూ ఈ రోజు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ని తన కుటుంబసభ్యులతో కలిసి రెండు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు.

ఇటీవల ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తనయుడు సాయి ప్రసన్నకుమార్ రెడ్డి వివాహం జరిగింది. అయితే మిర్యాలగూడలో భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి (CM RevanthReddy) ని ఆహ్వానించడంతో పాటు నియోజకవర్గ ప్రజలందరినీ పిలిచి విందు భోజనం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండి సమయం ఇవ్వకపోవడంతో రిసెప్షన్ నిర్వహించలేదు. అయితే తన తనయుడి రిసెప్షన్ కోసం ఉంచిన రెండు కోట్ల రూపాయలను రైతుల సంక్షేమం కోసం వెచ్చించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి చెక్కును అంద‌జేశారు. సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి చెక్కు అందజేసిన వారిలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాధవి దంపతులు, సాయి ప్రసన్నకుమార్.. వెన్నెల దంపతులు, చిన్న కుమారుడు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు.

Leave a Reply