donation | రూ.2 కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు..

donation | రూ.2 కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు..

  • పలువురికి ఆదర్శం ఈ దంపతులు..

donation | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ పైసల కోసం రకరకాల అవస్థలు పడుతూ మోసాలు చేస్తూ బ్రతుకుతున్న ఈ సమాజానికి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వంద రూపాయల కోసం కష్టపడుతున్న ఈ రోజుల్లో కోట్లాది రూపాయల ఆస్తులు గుడికి విరాళం ఇవ్వటం ఆ దంపతులకే చెల్లింది.

వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలులేని ఈ దంపతులు తమ ఆస్తిని గ్రామంలో ఉన్న మాధవరం రాములవారి గుడికి విరాళమిచ్చారు. తమ యావదాస్తి దాదాపు రూ.2 కోట్ల విలువగల ఆస్తిని ఆలయానికి చెందేలా వీలునామా రాచి రిజిస్ట్రేషన్ చేయించారు.

ఒక్క రూపాయి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అంత ఆస్తిని గుడికి ఇవ్వడంతో పలువురు అభినందిస్తున్నారు. ఈ దంపతులను చూసి గ్రామమంతా వారికి జేజేలు పలికారు. వీరిని మేళ తాళాలతో ఊరేగించారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. వీరిని ఆదర్శంగా తీర్చుకుని రాష్ట్రంలో పలువురు దేవాలయాలకు విరాలళ ఇవ్వటం స్పూర్తి దాయకం.

Leave a Reply