Business | నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ న‌ష్టాల‌తో ముగిశాయి. పహల్గామ్ ఉగ్రదాడి మన మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఇవాళ‌ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 588 పాయింట్లు కోల్పోయి 79,212 పడిపోయింది. నిఫ్టీ 207 పాయింట్లు దిగజారి 24,039 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించి రూ.85.44గా కొనసాగుతోంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ :
టీసీఎస్ (1.36), టెక్ మహీంద్రా (1.06), ఇన్ఫోసిస్ (0.60), అల్ట్రాటెక్ సిమెంట్ (0.46), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.32).

టాప్ లూజర్స్:
అదానీ పోర్ట్స్ (3.61), యాక్సిస్ బ్యాంక్ (3.48), ఎటర్నల్ (3.41), బజాజ్ ఫిన్ సర్వ్ (2.85), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.56).

Leave a Reply