Dollars 10 | బాసర హుండీ ఆదాయం 43 లక్షలు

Dollars 10 | బాసర హుండీ ఆదాయం 43 లక్షలు
Dollars 10 | బాసర, ఆంధ్ర ప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈ రోజు ఆలయ ఈవో అంజనీదేవి(Anjani Devi) సమక్షంలో లెక్కింపు నిర్వహించారు.
ఈ లెక్కింపులో నగదు నలబై మూడు లక్షల పదహారు వేల ఏడు వందల మూడు రూపాయలు (4316703)(Rs (4316703)), మిశ్రమ బంగారం అరవై గ్రాముల తొమ్మిది వందల మిల్లి గ్రాములు, మిశ్రమ వెండి ఒక కిలో 550 గ్రాములు, విదేశీ డాలర్లు 10(Foreign Dollars 10) వచ్చాయని ఆలయ ఈఓ అంజని దేవి తెలిపారు. ఆలయ ఏ ఈ ఓ సుదర్శన్, దేవస్థాన పర్యవేక్షకులు శివరాజ్, ఆలయ సిబ్బంది ఎస్ బి ఐ బ్యాంక్ సిబ్బంది, దేవస్థాన హోం గార్డ్స వాగ్దేవి సొసైటి , శ్రీ భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

