మూడ్రోజులు సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకురావొద్దు…

మూడ్రోజులు సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకురావొద్దు…

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష


పెద్దపల్లి, నవంబర్ 4, ఆంధ్రప్రభ: 3 రోజుల పాటు జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకురావద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Koya Sri Harsha) రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్ లో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులు, వ్యాపారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర పత్తి జిన్నింగ్ మిల్లు అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్ మిల్స్, సిసిఐ, ప్రైవేటు కొనుగోలుదారులు పత్తి కొనుగోలు నిలిపి వేస్తున్నామని అసోసియేషన్ నాయకులు తెలిపారని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రైతులు (Farmers) మార్కెట్ కు, జిన్నింగ్ మిల్లుల వద్దకు పత్తి తీసుకురావద్దని సూచించారు. సీసీఐ విధించిన నిబంధనలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 విధానం, పక్క జిల్లాల రైతులను అనుమతించడం, పత్తి రైతు ఎకరానికి 7 క్వింటాలు అమ్ముకునే వీలు కల్పించడం విషయంలో సీసీఐ కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో వెసులుబాటు కల్పించేంత వరకు పత్తి కొనుగోలు నిలిపేస్తున్నామని జిన్నింగ్ మిల్లు అసోసియేషన్ ప్రకటించారని కలెక్టర్ తెలిపారు.

ఈ అంశాలను రైతులు గమనించాలని, తదుపరి కొనుగోలు తేదీలను ప్రకటిస్థామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, కాటన్ మార్కెట్ కమిటీ కార్యదర్శులు, పోలీస్, రవాణా, అగ్నిమాపక శాఖల, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లు ఓనర్లు పాల్గొన్నారు.

Leave a Reply