DMHO | విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు

DMHO | విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు


జిల్లా వైద్యాధికారి మధుసూదన్
DMHO | మహా ముత్తారం, ఆంధ్రప్రభ : వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా వైద్యాధికారి (డిఎంహెచ్వో) మధుసూదన్ అన్నారు. ఇవాళ‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి, వైద్యాధికారి సందీప్ రావును వైద్య సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరిరక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం మండలంలోని గడపల్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను పరిశీలించారు. వైద్య సిబ్బందిని వెల్నెస్ సెంటర్ లో రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంట జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ సందీప్, దీప్తి, డి.డి.ఎం మధుబాబు, వైద్య సిబ్బంది, తదితరులున్నారు.

Leave a Reply