MINISTER| మహిళా శక్తి చీరల పంపిణీ

MINISTER| మహిళా శక్తి చీరల పంపిణీ

రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

MINISTER| గజ్వేల్ , ఆంధ్ర ప్రభ : తెలంగాణ ప్రగతి ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం గజ్వేల్ ఐఓసి లో కార్యాలయంలో నియోజకవర్గం లోని మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు, గనుల, భూ గర్భశాస్త్ర శాఖ మంత్రి (Minister Of Geology) జీ.వివేక్ వెంకట స్వామి హాజరై మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళ అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో 54 వేల చీరలు పంపిణీ చేయనున్నామని తెలిపారు.

తెలంగాణ గీతాలాపన సమయంలో చాలా మంది మహిళలు గేయాన్ని ఆలపించడం జరిగిందని రాష్ట్ర గీతానికున్న ప్రాముఖ్యత తెలియజేస్తుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (State Chief Minister Revanth Reddy) మహిళ అభ్యున్నతికి మొదటి ప్రాధాన్యత ఇస్తూన్నారన్నారు. మహిళలను అన్ని రంగాల్లో బలోపేతం చేయడానికి మహిళా శక్తి పెంచడానికి వారే స్వంతంగా ఆదాయం సంపాదించడం కోసం కుటుంబానికి పోషించడం కోసం అనేక పథకాలు చేపట్టారని పేర్కొన్నారు.

స్కూల్ యూనిఫాం, 28 కోట్ల వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజీ కార్యక్రమంలో 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఉచిత బస్సు కోసం 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ పథకాన్ని చాలా మంది మహిళలు (Women) ఉపయోగించుకుంటున్నారన్నారు. రేషన్ సన్నబియ్యం పంపిణీ 12వేల కోట్ల రూపాయలు ప్రభుత్యం ఖర్చు చేస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్యం వచ్చిన తరవాత మహిళలకు ఇష్టమైన రంగులతో చీరలను మన రాష్ట్రంలో సిరిసిల్ల, కరీంనగర్ లో తయారు చేసిన చీరలను పంపిణీ చేస్తుందన్నారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ వారి పేరు మీదుగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ అని నామకరణం చేశామన్నారు.

కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలు మహిళకు మేలు చేయడానికే ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు 11వేల శాంక్షన్ పత్రాలు అందజేశామని, అందులో 9వేల ఇల్లు నిర్మాణంలో బేస్ మెంట్ పేమెంట్ 1లక్ష రూపాయలు అకౌంట్ లో పడ్డాయని. మిగతా పేమెంట్ సైతం నిర్మాణం కాగానే వస్తాయన్నారు. మిగిలిన లబ్ధిదారులకు ఇంకో విడతలో తప్పకుండా ఇళ్లు మంజూరు చేస్తామని బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి (District Collector Haimavati) ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply