లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం లోని ఉప్లూర్ గ్రామానికి చెందిన మేడిపల్లి ప్రకాష్ గౌడ్ లబ్దిదారునికి ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి మంజూరైన 72,000 చెక్కును శనివారం గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు కి కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి లబ్ధిదారుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డిసిసి ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్,,గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ , వార్డు మెంబర్లు సాదుల్లా,అజయ్ గౌడ్ ,నాయకులు బద్దం తిరుపతి రెడ్డి , సుంకరి విజయ్ కుమార్, మారుపాక నరేష్,బండి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
