పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

15వ డివిజన్‌లో 110 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ
ఎమ్మెల్యే గద్దె రామమోహన్

కృష్ణలంక, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ పేదల కష్ట సుఖాల్లో అండగా ఉంటున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదవారి కుటుంబాలను సమయానికి ఆదుకుంటున్నారని తెలిపారు. గురువారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్‌ రామలింగేశ్వర నగర్‌ పడవలరేవు డౌన్‌( రుద్రభూమికి వెళ్ళేదారిలో) 110 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఆర్.ఎఫ్) నుంచి మంజూరైన రూ.1,12,92,727ల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.

తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ముఖ్య అతిధి హజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ పేదల కష్టాల్లో పాలుపంచుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ కలిసి ఈ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంజూరు చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలోని ప్రజలందరూ కలిసి అండగా నిలబడి పూర్తి స్తాయిలో మద్దతు ప్రకటించాలన్నారు.

ప్రజల అండతో కూటమి ప్రభుత్వం మరింత బలంగా తయారై మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. సీఎంఆర్‌ఎఫ్‌ పథకం గురించి నేటికి తెలియని వారు చాలా మంది ఉన్నారని, వారికి కూడా ఈ పథకం గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా బహిరంగ సభను నిర్వహించి చెక్కులను అందచేస్తున్నామని చెప్పారు. సీఎంఆర్‌ఎఫ్‌ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు మంజూరు అయ్యేలా చేయడానికి తన కార్యాలయంలో ఐదుగురు సిబ్బంది ఈ పని మీద పనిచేస్తున్నారని చెప్పారు.

నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఫించను ఒకే సారి వెయ్యి రూపాయలు పెంచి అందచేస్తున్నారని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఫించను వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టిందన్నారు. అంతేకాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే పథకాన్ని కూడా అమలు చేస్తున్నామన్నారు. వికలాంగులకు అండగా ఉండేందుకు ఆర్టీసీ బస్సుల్లో వారు కూడా ఉచితంగా ప్రయాణించే పథకాన్ని కూడా తమ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ అమలు చేస్తారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.


ఈ కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్‌, పొట్లూరి సాయిబాబు, పేరేపి ఈశ్వర్, శింగంశెట్టి రమేష్, గాదిరెడ్డి అమ్ములు, కొవ్వూరు కిరణ్, నామేశ్వరరావు, శిరీష గాంధి, సుగసాని రత్నశ్రీ, మైలుమూరు పీరుబాబు, దున్నా రత్నం, హయత్ ఖాన్, పెనుగొండ శ్రీను, నందిపాటి దేవానంద్, యార్లగడ్డ సందీప్, చిన్నం ఈశ్వరరావు, చెరుకూరి మురళి, పలువురు డివిజన్ అధ్యక్షులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply