Charities | బడ్డీకొట్టు వితరణ

Charities | బడ్డీకొట్టు వితరణ

వైఎస్ఆర్‌ చారిటీ ద్వారా అంద‌జేత‌

Charities | ఆంధ్రప్రభ, విజయవాడ : విజయవాడ నగరంలో వైఎస్ఆర్‌ (YSR) చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తోపాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్య‌క్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం వైఎస్ఆర్‌ చారిటీ చైర్మన్ యలమంచిలి జయ ప్రకాష్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం, మొగల్ రాజుపురం చెందిన పరస రఘుబాబుకి జీవనోపాధి నిమిత్తం రూ.25,000 విలువ చేసే బడ్డికొట్టును దేవినేని అవినాష్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. దేవినేని నెహ్రు సేవా స్ఫూర్తితో జయ ప్ర‌కాష్ వారి చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్య రంగాలలో అండగా నిలుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయ ప్రకాష్, కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్, డివిజన్ అధ్యక్షుడు లంకా అబ్బి నాయుడు, వైసీపీ నాయకులు సంపత్, పర్వతనేని బాబీ, యోనా రాజు, రాజేష్, కొండా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply