అంబేద్కర్ చౌరస్తాలో అంబలి పంపిణీ

బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ : ఎండల తీవ్రత దృష్ట్యా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా మార్కెట్ ఏరియాలో ఆదివారం తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు. వరుసగా మూడవ రోజు జరిగిన ఈ కార్యక్రమానికి దాత కీర్తిశేషులు హరి కిసాన్ సోనీ కుటుంబ సభ్యులు సహకారం అందించారు. సుమారు 400 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, బాటసారులు మరియు చిరు వ్యాపారులకు ఉచితంగా అంబలిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. దాతల సహకారంతో ప్రతిరోజూ అంబలి పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. ఎండలో ప్రయాణించే వారికి ఉపశమనం కలిగిస్తున్న ఈ చొరవను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో తిలక్ వాకర్స్ సభ్యులు రంగ రామన్న, గెల్లీ జయరాం యాదవ్, ముత్తె వెంకట్ రాజం, కందుల శ్రీనివాస్, నాగుల లింగయ్య, మహేందర్ చౌదరి, గురు స్వామి, ఏనుగు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
