పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని కొత్త గుండ్లపల్లి గ్రామంలో కంబాల సాయితేజ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే 7, 8 వార్డ్ కౌన్సిలర్లు పెలిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్, పేరబోయిన సత్యనారాయణ యాదవ్ పాల్గొన్నారు.

స్కూల్ ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ కంబాల నవనీత, హెడ్‌మాస్టర్ వెంకన్న, టీచర్ వాణి, కంబాల జహంగీర్, పాండు, పేరబోయిన మహేందర్, బండి అనిల్, బండ రాజు, ముక్యర్ల రాజు, కంబాల నరసింహతో పాటు గ్రామ యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply