Distribution | సొంతూరు మీద ప్రేమతో..

Distribution | సొంతూరు మీద ప్రేమతో..
- యువకులకు క్రికెట్ కిట్టుల పంపిణీ
- తన సొంత డబ్బుతో అందజేసిన రసీంద్ర గౌడ్
- గ్రామస్తుల అభినందనలు
Distribution | కుంటాల, ఆంధ్రప్రభ : సొంతఊరుపై ప్రేమతో కుంటాల మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన సుంకరి శ్రీశైలం గౌడ్ రేణుకల కుమారుడు రసీంద్ర గౌడ్ తనవంతు సహకారంగా గ్రామ యువకులకు క్రీడా సామగ్రిని అందజేశారు. దాదాపు 45 వేల రూపాయల విలువగల క్రికెట్ సామాగ్రిని యువతకు అందజేయడం పట్ల ఆయన పట్ల పలువురు అభినందించారు. ఈయన లండన్లోని ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. గత నాలుగు రోజుల నుంచి గ్రామంలో జరుగుతున్నక్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. శుక్రవారం పోటీలు ముగియడంతో ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎర్రోజ్ ప్రవలి ప్రశాంత్ బీసీ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమరవేణి నర్సా గౌడ్ రిటార్డ్ సగం గంగాధర్ డాక్టర్ గణేష్ యువకులు తదితరులు పాల్గొన్నారు
