సిక్కోలులో బీభత్సం

సిక్కోలులో బీభత్సం

  • అటు ఈదురు గాలులు
  • ఇటు భారీ వర్షాలు
  • నదులన్నీవరద పోటు
  • అంధకారంలో గ్రామాలు
  • రహదారులు ధ్వసం
  • ఇంటి గోడ కూలి వృద్ధ దంపతులు దుర్మరణం
  • సిక్కోలు అధికారులు రెడ్ అలెర్ట్

శ్రీకాకుళం బ్యూరో, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి శుక్రవారం ఉదయం ఒడిశా(Odisha)లో తుపాన్ తీరం దాటిన నేపథ్యంలో ముందుగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాలు శ్రీకాకుళం(Srikakulam) జిల్లాను అతలాకుతలం చేశాయి. ఒడిశాలోనూ భారీ వర్షాలు కురవడంతో వంశధార(Vamsadhara), నాగావళి, బహుద, మహేంద్ర తనయ నదులకు వరద పరవళ్లు తొక్కటంతో అనేక ప్రాంతాలలో పంట పొలాలు నీట మునిగాయి.

అనేక మండలాల్లో నీరు ప్రవహించడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల కల్వర్ట్లపై కూడా వర్షం నీరు ప్రవహించడంతో ఆయా ప్రాంతాల్లో పలు గ్రామాలకు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రధాన నదులు , వంశధార, నాగావళి(Nagavali) నదులకు గురువారం సాయంత్రం నుంచి వరద నీరు చేరుతోంది. గురువారం రాత్రి వంశధార గొ ట్ట బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయగా వంశధార నది పరివాహ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు గురువారం రాత్రి జిల్లా కలెక్టర్(District Collector), జిల్లా ఎస్పీ కొత్తూరు, హిరమండలంలోని పలు గ్రామాలలో పర్యటించి తీరప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే విధంగా చర్యలు చేపట్టారు.

భారీ వర్షాలు కారణంగా మందస మండలం సవర, తుంబూరు గ్రామంలో ఒక ఇంటి గోడలు కూలి వృద్ధ దంపతులు సవర రూపమ్మ(Rupamma), సవర చిన్న గుడియా మరణించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు బుధవారం నుంచే ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని, ఇతర అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, గాలులు కారణంగా గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు అనేక ప్రాంతాలలో విద్యుత్(Vidyut) నిలిచిపోవడంతో జిల్లాలో దసరా పండుగ బాగా కళ తప్పింది.

దసరా పండుగ రోజున భక్తులు ఉదయం నుంచి ఆయా ఆలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు చేయిస్తూ రావడం సాంప్రదాయంగా వస్తోంది. గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురవడంతో భక్తులు ఆలయాలకు వెళ్ళలేకపోవడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని ఆలయాలు వెలవెలబోయాయి శుక్రవారం ఉదయం నుంచి వర్షాలకు తెరిపిచ్చి కాస్త ఎండ ఎక్కడంతో ప్రజలు కొంతవరకు ఊపిరి తీసుకున్నప్పటికీ శుక్రవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్ననేపథ్యంలో జిల్లా అధికారులు(Officers) ఎప్పటికప్పుడు వంశధార, నాగా వళి నది తీర ప్రాంత ప్రజలను, ఆయా మండలాల అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు.

ఒడిశా అధికారులతో మాట్లాడుతూ, వరద పరిస్థితిని ముందుగానే తెలుసుకుంటున్నారు. భారీ వర్షాలు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

Leave a Reply