Dismissal | వివాద‌స్ప‌ద మంత్రిని ఇంటికి సాగ‌నంపిన స్టాలిన్ ..

చెన్నై – మ‌హిళ‌ల‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్యాలు చేసిన త‌మిళ‌నాడు అట‌వీ శాఖ మంత్రి పొన్మ‌డిని ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఇంటికి సాగ‌నంపారు.. అతడి చ‌ర్య‌ల‌ను త‌ప్పు ప‌డుతూ మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే డీఎంకే సీనియర్ నేత, అటవీశాఖ మంత్రి పొన్ముడి ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ తిలకాలపై సెటైర్లు వేశారు. తిలకాలను లైంగిక భంగిమలతో పోల్చారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేశాయి. బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ దీనిపై స్పందించారు. ”మీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు అర్థం నాకంటే మీకే బాగా తెలుసు. ఇలాంటి వ్యాఖ్యలు మీ ఇంట్లో మహిళలు అంగీకరిస్తారా ? అంటూ” సీఎం స్టాలిన్‌ను ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లని దేవుడే శిక్షిస్తాడని సింగర్ చిన్మయి మండిపడ్డారు. చివరికీ ఆయన సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. దీంతో డీఎంకే అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. పొన్ముడిని మంత్రి పదవి నుంచి తొలగించింది.

మరోవైపు డీఎంకే ఎంపీ కనిమొళి కూడా పొన్ముడి వ్యాఖ్యలపై స్పందించారు. ”పొన్ముడి వ్యాఖ్యలు ఆమోదయోగ్యమైనవి కాదు. కారణం ఏదైన సరే.. మహిళలపై అతడు చేసిన అవమానకర వ్యాఖ్యలు ఖండించాల్సిందేనని రాసుకొచ్చారు. చివరికీ పొన్ముడి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదవ్వడంతో ఆయన్ని డీఎంకే అధిష్ఠానం మంత్రి పదవిని తొలగించింది. అలగే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవితో పాటు మిగతా పదవులు కూడా తొలగించింది.

Leave a Reply