మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు..

మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ తరఫున గెలుపొందిన నలుగురు కౌన్సిలర్లను దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు శాలువాలతో సన్మానించారు. తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్‌తో పాటు కౌన్సిలర్లు స్రవంతి, శ్యామ్ రెడ్డి, లావణ్య, సురేందర్, రుషిత, సాయిచంద్‌లను శాలువాలతో సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా వడ్ల నందు మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడంలో కౌన్సిలర్లు కీలక పాత్ర వహించాలని అన్నారు. ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ ప్రస్తావిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిచరణ్ రెడ్డి, శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
