వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి

ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్

మోత్కూర్, ఆంధ్రప్రభ : వికలాంగులకు సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కేటాయించాలని ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేంద్ర అన్నారు. గురువారం మున్సిపల్ కేంద్రంలో ఎన్ పి ఆర్ డి టౌన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేంద్ర మాట్లాడుతూ గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వికలాంగులకు సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పి ఇప్పటికీ శిశు సంక్షేమ శాఖ లోనే కొనసాగిస్తున్నారని, వికలాంగులకు ఎంత బడ్జెట్ అనేది తెలియక ఇప్పటికే అర్థమయ్యే పరిస్థితి లేదన్నారు.

ప్రత్యేక వికలాంగుల సంక్షేమ శాఖ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.గతంలో ఉన్న పెన్షన్ బకాయి పడ్డ డబ్బులు వెంటనే అమలు చేయాలని, వికలాంగులకు పరికరాలు ఇస్తామని ఇప్పటికీ మూడు దఫాలుగా దరఖాస్తులు పెట్టుకున్నా ఏ ఒక్కరికి కూడా బడ్జెట్ లేదని పరికరాలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు.వికలాంగులకు ఉపాధి అవకాశాల్లో రుణాలు ఇస్తామని ఇప్పటికీ బ్యాంకు ద్వారా ఏ మాత్రం రుణం ఇచ్చే పరిస్థితి లేదన్నారు.

వెంటనే ప్రతి వికలాంగునికి ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రూ.10 లక్షల రుణం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ఎన్నికల్లో ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం , ఇప్పటికీ 27 నెలలు గడిచిన రూ. 6000 పెన్షన్ ఇస్తానని ఇచ్చే పరిస్థితి లేదని, ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని రూ.బి6000 పెన్షన్ వెంటనే ఇవ్వాలని, వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని , వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డు ద్వారా 35 కిలోల బియ్యం వెంటనే ఇవ్వాలని, వికలాంగులకు ఎన్నికలలో అవకాశం కొరకు నామినేటెడ్ పోస్టులు చేయాలని, గ్రామపంచాయతీ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు నామినేట్ పోస్ట్ లు అమలు చేయాలని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీల్లో వికలాంగుల సమస్యలు పరిష్కారం అమలు చేస్తారని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి ఎన్ పి ఆర్ డి డివిజన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, మోత్కూరు మండల అధ్యక్షులు ఎర్రవెల్లి నాగేష్ , టౌన్ అధ్యక్షులు గౌలికర్ రాజు, మున్సిపాలిటీ అధ్యక్షులు గుండు శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి అప్పల యాదగిరి ,వెంకటేష్, మహిళా కన్వినర్ మంజుల, గొడిశాల యాదగిరి, చేతరాశి రమేష్, జయభిక్షం, ఎండి జమాల్, ఎస్.కె కాశీం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply