కశింకోట, ఆగస్టు 26 ( ఆంధ్రప్రభ ) : విశాఖ రేంజి డీఐజీ (Visakhapatnam Range DIG) గోపీనాథ్ జెట్టి కశింకోట పోలీసు స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, రిసెప్షన్‌లో పోలీసు స్టేషన్ కు వచ్చేవారితో ప్రవర్తించే తీరుపై సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసులు ( Pending Cases) త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… స్టేషన పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ (Police Station) కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ శ్రావణి, సీఐలు స్వామి నాయుడు, విజయ్ కుమార్,ఎస్‌ఐలు మనోజ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.