Dial 100 | సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు

Dial 100 | సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు
- ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు
- నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్
Dial 100 | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం(Peaceful atmosphere)లో పోలింగ్ నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ కేంద్రంతో పాటు మండలంలోని మల్లేపల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల(polling stations)ను పరిశీలించి మాట్లాడారు.
మూడో విడత ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే డయల్ 100(Dial 100)కి ఫోన్ చేయాలని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో నిర్భయంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేలా ప్రజలు, నాయకులు సహకరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్(Additional) ఎస్పీ రియాజ్ ఉల్ హక్, డీఎస్పీ మహేష్, ఎస్సై రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

