డయల్ 100, 112 అందుబాటులో..

డయల్ 100, 112 అందుబాటులో..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పనిచేసేచోట కూలీలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని షీటీం పోలీసులు బాలరాజ్(Balaraj) హెచ్చరించారు. ఈ రోజు నారాయణపేట జిల్లాఊట్కూర్ మండల పరిధిలోని విజయ కాటన్ ఇండస్ట్రీస్(Vijaya Cotton Industries) వద్ద పనిచేస్తున్న కూలీలకు నారాయణపేట జిల్లా షీటీమ్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. పని చేసే చోట మహిళలను ఎవరైనా వేధింపులు, అశ్లీల వ్యాఖ్యలు, బెదిరింపులు, అనుచిత ప్రవర్తన చేసినా భయపడకుండా వెంటనే నారాయణపేట(Narayanpet) షి టీమ్ 8712670398 పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళల భద్రత, గౌరవం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్, డయల్ 100, 112(She Team, Dial 100, 112) నంబర్లు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఉద్యోగస్త మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని, వేధింపులు ఎదురైతే న్యాయపరంగా రక్షణ పొందే మార్గాలు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో షి టీమ్ పోలీసులు జ్యోతి, కవిత, ప్రజలు, కూలీలుయువకులు పాల్గొన్నారు.
