Dharna | అట్టుడుకుతున్న ఆదోని..

Dharna | ఆదోని రూరల్ ,ఆంధ్రప్రభ : ఆదోని ధర్నాలు, రాస్తా రోకోలతో సోమవారం అట్టుడికి పోయింది. ఒక వైపు ఆదోని మండలంలోని 16 గ్రామాలను కొనసాగించాలని మరో వైపు హరివానమును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని పోట పోటీగా ర్యాలీలు, రాస్తారాకోలు చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి వినతి పత్రాలు అందజేశారు. వేలాది మంది సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడంతో ఆ ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. ఆదోని డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
